పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్ చుక్కలు చూపించింది. రోడ్లపై భారీగా చెట్లు ఈదురు గాలులకు పడిపోవడంతో జనాలు ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బెంగాల్ ఒరిస్సా లో కలిపి దాదాపు పది జిల్లాల్లో వర్షం తీవ్రంగా పడింది. 

 

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ఇక ఈ తుఫాన్ తీవ్రతకు 15 మంది ప్రాణాలు కోల్పోగా బెంగాల్ రాజధాని కలకత్తా విమానాశ్రయంలో భారీగా నీరు చేరింది. రన్ వే పై నీరు చేరడం తో ఇప్పుడు నీటిని తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు అధికారులు. తుఫాన్ ప్రభావం ఇంకా ఉండే అవకాశం ఉంది. భారీగా చెట్లు పడటం తో కలకత్తా మొత్తం కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: