ఒక పక్క సినిమాలు లేవు, ఎక్కడికి అయినా వెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటే విమానాలు లేవు. కాలు బయటపెడితే క్వారంటైన్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ నేపధ్యంలో సినిమా హీరోయిన్ లు హీరోలు సోషల్ మీడియాలో ఏదోక సందడి చేస్తూనే ఉన్నారు. తమ అభిమానులకు ఏదోక వినోదం అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

 

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు ప్రశ్న వేసింది. తన పేరు మార్చుకోవాలని అనుకుంటున్నా అని అసలు ఏది పెడితే బాగుంటుందో చెప్పాలి అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కొందరు అయితే మీకు మంచి పేరు తీసుకొచ్చిన గీత గోవిందం సినిమాలోని గీత అనే పేరు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: