తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఢిల్లీ లో ఒక వ్యక్తి హోం గార్డ్ కి విషం ఇచ్చి చంపాలి అనుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒక హోం గార్డు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని నిర్ధారణకు వచ్చిన 42 ఏళ్ళ వ్యక్తి అతన్ని చంపడానికి గానూ ప్లాన్ వేసాడు. 

 

ఈ ప్లాన్ లో భాగంగా ఇద్దరు మహిళలను ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి వాళ్ళను సదరు హోం గార్డ్ ఇంటికి పంపించి కరోనా మందు అంటూ విషం ఇవ్వాలి అని సూచించాడు. దీనితో హోం గార్డ్ ఇంటికి వెళ్ళిన ఆ ఇద్దరు కుటుంబ సభ్యులకు విషం ఇవ్వడం ఈ విషయం పక్కింటి వాళ్లకు తెలియడం పోలీసులకు ఫిర్యాదు చేయడం విషం తీసుకున్న వాళ్ళను ఆస్పత్రికి తరలించడం, సీసీటీవీ లో మహిళలను గుర్తించి అరెస్ట్ చేసి కుట్ర బయటకు లాగడం జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: