తెలంగాణ విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త యూనివ‌ర్సిటీలు ప్రారంభం కాబోతున్నాయి. తాజాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదు యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ఐదు యూనివర్సిటీలలో దాదాపు మూడు యూనివర్సిటీలు గులాబీ నేతలవేనని తెలుస్తోంది.

 

మల్లారెడ్డి యూనివర్సిటీ - మల్లారెడ్డి(మంత్రి), అనురాగ్ యూనివర్సిటీ - పల్లా రాజేశ్వర్ రెడ్డి(ఎమ్మెల్సీ,రైతు బంధు సమితి చైర్మన్), ఎస్సార్‌ యూనివర్సిటీ - వరదా రెడ్డి(గతంలో తెరాస ఎమ్మెల్సీ బ‌రిలో ఉన్న వ్యక్తి), 4.మహీంద్రా యూనివర్సిటీ (ఆనంద్ మహీంద్రా), వోక్సేన్ యూనివర్సిటీ (ప్రవీణ్ పులా)ల‌కు ఆమోదం ల‌భించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: