కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా విపత్తు సమయంలో ఆర్థిక రంగానికి పునరుత్తేజం తీసుకురావాలని 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని... ఇప్పట్లో కొత్త ఉద్దీపనలుండవని... 20 లక్షల కోట్ల ప్యాకేజీతోనే సరిపెట్టుకోవాలని చెప్పారు. కొత్త ప్యాకేజీ గురించి కొన్నాళ్ల తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఆత్మనిర్భర భారత్‌ ప్యాకేజీతో పరిశ్రమలు, వ్యాపారాలు గాడిన పడతాయని, తిరిగి వేతన జీవులకు వేతనాలు అందుతాయని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ప్రజలకు నేరుగా సాయం అందించడం లేదని విమర్శలు వస్తున్నాయని... అలా చేసినంత మాత్రాన డిమాండ్‌ ఊపందుకోదని అన్నారు. వడ్డీ వ్యయాలు తగ్గి మూలధన సాయం పెరగాలని, కంపెనీలు వేతనాలు చెల్లించే పరిస్థితి రావాలని కొత్త ప్యాకేజీని రూపొందించామని ఆమె చెప్పారు. వేతనాలు అందితే ప్రజల వద్ద నగదు చేరి, కొనుగోళ్లు పెరుగుతాయని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: