దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడుతున్న కొవిడ్‌ వారియర్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు, న‌ర్సులు, లాక్ డౌన్ అమలులో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ముంబైలో అధికంగా ఉంది. తాజాగా ముంబైలో ఓ ఏఎస్ఐ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. ఈ విష‌యాన్ని ముంబై పోలీసులు ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.

 

ఏఎస్ఐ భివ్సేన్ హరిభావు పింగిల్ వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించ‌డం త‌మ‌నెంతో బాధించింద‌ని ముంబై పోలీసులు విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న క‌రోనా వైర‌స్‌తో పోరాడార‌ని పేర్కొన్నారు. అతను ఏప్రిల్ నుండి సెలవులో ఉన్నాడ‌ని తెలిపారు. అతని ఆత్మకు శాంతిచేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ముంబైపోలీసులు ట్విట్ట‌ర్‌లో తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: