దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు పోరాడుతున్నారు.  కరోనా భయంతో ప్రతిరోజూ వణికిపోతున్నారు.  అయితే కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  కానీ కాశ్మీర్ లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  దాయాది దేశం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వరుసగా కాల్పులు జరుపుతున్నారు.దానికి ధీటుగా భారత సైనికులు సరైన సమాధానం చెబుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాలపై వరుసగా కాల్పులు తెగబడుతున్నారు.  ఓ వైపు లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం అవుతున్నారు కాశ్మీర్ వాసులు... ఇదే సమయంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గురువారం పుల్వామా ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతిచెందాడు.

 

మరో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వీరి నుంచి ఆయుధాలను ఉగ్రవాదులు లాక్కెళ్లిపోయారు. బైకులపై వచ్చిన ఉగ్రవాదులు పోలీసులే లక్ష్యంగా కాల్పులు జరిపి పారిపోయారని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. అప్పటికే అలర్ట్ అయిన పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు ఉగ్రవాదులు. . రెండు రోజుల్లో వరుసగా ఉగ్రవాదుల కాల్పులు జరుపడంతో భద్రతా దళాలు అలర్ట్‌ అయ్యాయి. పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇలాఉండగా, కుప్వారా జిల్లాలోని సోగమ్‌ ప్రాంతంలో ఇటీవలనే ఉగ్రవాదులతో చేరిన ముగ్గురు వ్యక్తులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: