లాక్ డౌన్ లో మందుబాబులు తాగడానికి చుక్క మందు లేక చాల అవస్థలు పడ్డారు. కొంతమంది అయితే పిచ్చి పట్టిన వారిలెక్క ప్రవర్తించారు వారిని ఏరాగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్పించారు కూడా. ఇలాంటి సమయంలో మందుబాబుల కోసం ఆన్లైన్ మద్యం డెలివరీ సదుపాయాలను తెచ్చారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ అసదుపాయాన్ని వినియోగించుకోలేక పోయారు మందుబాబులు. కేంద్రం తొలగించిన కొన్ని సడలింపులు కారణంగా వైన్ షాపులు మద్యాన్ని అమ్మకాలు మొదలు పెట్టాయి. అయితే ఈ సందర్భంగా బార్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మండుటెండలో బారులు తీరారు. క్యూ లైన్ లు ఊరుని దాటిపోయేలాగా ఉండడంతో కొందరు మద్యాన్ని కొనడమే మానేశారు.

IHG

 

ఇక పై క్యూ లైన్ లో గంటల తరబడి వెయిట్ చేయకుండా మందుబాబుల‌కు జార్ఖండ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. మ‌ద్యాన్ని హోమ్ డెలివ‌రీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. బారులు తీరిన మందుబాబులకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఆన్లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ చేయవలసిందిగా  స్విగ్గీ, జొమాటోలకు అనుమతి ఇచ్చింది. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో ఇప్ప‌టికే మ‌ద్యాన్ని హోమ్ డెలివ‌రీ చేస్తోంది. ఈ స‌దుపాయాన్ని త్వ‌ర‌లోనే మిగ‌తా న‌గ‌రాల‌కు సైతం అందుబాటులోకి తెచ్చే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఓ ష‌రతు కూడా ఉందండోయ్‌. ముందు మీ వ‌యసు నిర్ధారించుకున్న త‌ర్వాతే ఆర్డ‌ర్‌ను స్వీక‌రిస్తుంది. జొమాటో , స్విగ్గీలు మిగతా రాష్ట్రాలతో ఈ సదుపాయం పొందడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తూవుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: