దేశంలో కరోనా విజృంభణతో పలు కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించగా మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) జీతాల్లో కోత విధించినట్టు వార్తలు వచ్చాయి. టీటీడీ 400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని... ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వార్తలు వచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న పుకార్లపై టీటీడీ ఛైర్మన్ వీవీ సుబ్బారెడ్డి స్పందించారు. 
 
ఉద్యోగుల జీతాల్లో కోత విధించినట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని... స్వామి దయ వల్ల టీటీడీ దగ్గర నిధులు ఉన్నాయని... సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను భక్తులు నమ్మవద్దని కోరారు. పరిస్థితులు త్వరలోనే సర్దుకోవాలని కోరుకుంటున్నామని... భవిష్యత్తులో కూడా కోతలు విధించకుండా జీతాలు ఇస్తున్నామని తెలిపారు. స్వామి వారికి జరగాల్సిన పూజలు జరుగుతున్నాయని టీటీడీ స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: