మధుసూదన్ అనే మృతదేహం అప్పగింత విషయంలో వివాదాస్పదం కావడంతో ఇప్పుడు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వివరణ ఇచ్చారు. మధుసూదన్ విషయంలో ఏ విధమైన నిర్లక్ష్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఐసిఎంఆర్ సూచనల మేరకే తాము పోలీసులకు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. 

 

అతని బంధువులకు సమాచారం ఇచ్చే పోలీసులకు అప్పగించామని ఆయన వివరణ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న వైద్యులపై ఆరోపణలు సరికాదని ఆయన సూచించారు. కాగా ఈ వ్యవహారం అటు తెలంగాణా ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. అతని భార్య సుప్రీం కోర్ట్ కి వెళ్తా అంటూ ప్రకటించారు. తనకు సమాచారం ఇవ్వలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారని ఆమె నిలదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: