ఇరాన్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ దేశంలో దాదాపుగా పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు ఆ దేశ మీడియా చెబుతోంది. ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఖాసీమ్‌ జాన్‌బాబాయి ఈ విషయం వెల్ల‌డించిన‌ట్లు తెలిపింది. అయితే కొన్ని రోజుల క్రితం వెలువడిన‌ సమాచారం ప్రకారం దాదాపు 800 మంది ఆరోగ్య కార్యకర్తలు వైరస్‌ బారినపడ్డారు. వీరిలో సుమారు వంద మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్‌ చెబుతోంది.

 

క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా గురువారం నాటికి ఇరాన్‌లో 7249 మంది మరణించారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 1.29 లక్షల మందికి కరోనా సోకింది. బుధవారం నుంచి 24 గంటల్లో 2392 మంది కొత్తగా వైర‌స్‌ బారిన పడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: