దేశ వ్యాప్తంగా ఇప్పుడు వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంది కూడా వాళ్ళే. కరోనా తీవ్రత పెరగడం లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడం వారికి బాగా ఇబ్బందిగా మారింది. ఇక ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. 

 

వలస కార్మికులను ఎక్కువ సంఖ్యలో సొంత రాష్ట్రాలకు తరలించాలి అని భావిస్తుంది. ఇందుకోసం రైళ్ళ సంఖ్యను పెంచడమే కాకుండా... కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర గుజరాత్ సహా పలు రాష్ట్రాల నుంచి విమానాలను నడపాలి అని భావిస్తుంది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: