ఒరిస్సా లో కరోనా కట్టడి అయినట్టే అయి రోజు రోజుకి పెరుగుతుంది. కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు  ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుని లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. 

 

అక్కడ ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒడిశాలో ఈ రోజు 86 కొత్త  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1189 గా ఉందని ఒడిశా ఆరోగ్య శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. రాబోయే రెండు మూడు వారాల్లో అక్కడ కేసుల పరిస్థితి చూసి లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: