ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాతో మట్లాడుతూ 3.7 శాతం ఆహారోత్పత్తి పెరిగిందని... 17 శాతం పారిశ్రామిక రంగంలో తగ్గుదల నమోదైందని అన్నారు. రెపో రేటు 40 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో ఉత్పత్తి పెరిగిందని అన్నారు. రివర్స్ రెపోరేటును 3.35 శాతానికి తగ్గించామని తెలిపారు. ఆర్బీఐ వృద్ధి రేటు పెంచే విధంగా చర్యలు తీసుకోనుందని అన్నారు. 13 - 32 మేర ప్రపంచ వాణిజ్యం తగ్గిందని అన్నారు. 
 
2021లోను జీడీపీ వృద్ధి తిరోగమనంలోనే ఉంటుందని తెలిపారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా ఉందని అన్నారు. వృద్ధిరేటు పెంచేలా ఇప్పటికే చర్యలు మొదలయ్యాయని.... సిమెంట్, స్టీల్ పరిశ్రమలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలపై ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: