ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈరోజు మీడియాతో మాట్లాడారు రెపో రేటు 40 బేసిక్ పాయింట్లు తగ్గించామని తెలిపారు. రెపో రేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. ఆర్బిఐ గవర్నర్ రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. జూన్ 1 నుంచి ఆగష్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ సమయంలో 3.7 శాతం ఆహారోత్పత్తి పెరిగిందని అన్నారు. 
 
ద్రవ్యోల్బణం అంచనా వేయడం కష్టంగా మారిందని చెప్పారు. మారటోరియం మరో మూడు నెలలు పెంచడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతో ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. గతంలో మూడు నెలలు మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు మారటోరియం పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: