కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో శక్తికాంత్ దాస్ మరోసారి మీడియాతో మాట్లాడారు. మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిపోయిందని అన్నారు. 2021లోను దేశం తిరోగమన దిశలోనే పయనిస్తుందని చెప్పారు. మరో మూడు సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల పాటు మారటోరియంను పొడిగిస్తున్నామని ఆయన అన్నారు. 
 
కరోనాతో దేశం ఎలా వెనక్కు వెళ్లిపోయిందో గవర్నర్ తన లెక్కలతో చెప్పారు. సిమెంట్ ఉత్పత్తిలో 25 శాతం తగ్గిందని అన్నారు. ఏప్రిల్ లో తయారీ రంగం ఎన్నడూ లేని విధంగా క్షీణించిందని తెలిపారు. టర్మ్ లోన్లపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: