దేశంలో కరోన వైరస్ మొదలైనప్పటి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు.  అప్పటి నుంచి ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. దాంతో ఆర్ బీ ఐ మూడు నెలల పాటు మారిటోరియం ప్రకటించారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆర్థిక ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. టర్మ్‌ లోన్లపై మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు తెలిపారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్‌ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు వివరించారు.

 

అయితే, ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని చెప్పారు. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని తెలిపారు. కరోనా వ్యాప్తి కట్టడి ఆధారంగానే ఆర్థిక కార్యకలాపాల భవిష్యత్తు ఆధారపడి ఉందని వివరించారు. రివర్స్‌ రెపో రేటు 3.2 శాతానికి తగ్గింపు.. రెపోరేటును 4.40 నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నాం అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: