ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించారు. పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పరిశ్రమలకు అధికారులు సుబ్ర‌హ్మ‌ణ్యం, క‌రికాల‌న్‌తో పాటు మంత్రి గౌత‌మ్‌రెడ్డి కూడా ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందిస్తారని అన్నారు. వీరికి పరిశ్రమలపై అవగాహన ఉందని... పరిశ్రమల్లో లాభనష్టాల గురించి తెలుసని అన్నారు. 
 
జగన్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డిని యంగ్ స్టర్ అని ప్రశంసించారు. మంత్రికి పరిశ్రమల గురించి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లకు ఈ సందర్భంగా చెబుతున్నానని అన్నారు. మొదటి విడతలో ప్రోత్సాహకంగా 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: