అంఫన్ తుఫాను వల్ల బెంగాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ కు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. కేంద్ర మంత్రులు, సీఎం మమతా బెనర్జీతో కలిసి తుఫాను తీవ్రత తెలుసుకునేందుకు మోదీ ఏరియల్ సర్వే జరిపారు. అనంతరం వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. అంఫన్ వల్ల బెంగాల్ కు తీవ్ర నష్టం జరిగిందని మోదీ అన్నారు. 
 
ప్రస్తుతం తాత్కాలిక సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించామని... నష్టం గురించి పూర్తిస్థాయిలో అంచనా వేసిన తరువాత మరో వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరేంత వరకు సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: