విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్ట్ లో విచారణ  జరిగింది. ఈ సందర్భంగా పిటీషనర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కంపెనీ లాయర్లు పాస్ పోర్ట్ లు సమర్పించామని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలతో 50 కోట్లు డిపాజిట్ చేసామని పేర్కొన్నారు. 

 

అదే విధంగా గ్యాస్ లీకైన ట్యాంక్ మినహా... అన్నీ కూడా దక్షిణ కొరియా కి తరలించామని, ఏదోక సంస్థ తో విచారణ జరపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్ట్ ఆదేశించింది. కేసుని వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తాము ఎక్కడికి వెళ్ళడం లేదని అనవసర ఆరోపణలు చేస్తున్నారని కంపెనీ లాయర్లు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: