ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అధికార పక్షం వైసీపీ నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది.  ప్రస్తుతం ఏపిలో కరోనా కష్టాలు సరిపోవన్నట్లు ఈ మద్య విశాఖలో గ్యాస్ లీక్ మరింత కష్టాన్ని తెచ్చిపెట్టింది.  కాగా, ప్రతిపక్ష నేతల ఇంకా ఇదే విషయంపై గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సేవలు అవసరం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు. దుర్బుద్ధి వల్లే చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ కూడా చంద్రబాబు రాజకీయాలకు బలవుతున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నీచ రాజకీయాలే చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. 

 

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ప్రతి అంశాన్ని రాజకీయాలకు అనుగుణంగా మలుచుకునేందుకు యత్నిస్తారని విమర్శించారు. ఆయన జూమ్ ద్వారా మీటింగులు పెట్టుకుంటూ జూమ్ నాయకుడిగా ఎదిగిపోయారని అన్నారు. ప్రత్యక్షంగా పరిస్థితులను గమనిస్తే నిజాలేంటో తెలుస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఒక తండ్రిలా జగన్ సేవ చేస్తున్నాడని అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రజలకు సీఎం జగన్ పై అపారమైన నమ్మకం ఉంది.. అది ఎంత మంది వచ్చినా చెరిగిపోదు అన్నారు. ఇక డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ ఇద్దరూ టీడీపీ సానుభూతిపరులని లక్ష్మీపార్వతి అన్నారు.   టీడీపీకి అనుకూలంగా రంగనాయకమ్మ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: