వలస కూలీల విషయంలో చేతులు దులుపుకోవద్దని తెలంగాణా ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్ట్ చురకలు అంటించింది. వలస కూలీలను అదిలాబాద్ సరిహద్దు దాటించి వదిలేస్తున్నారని వసుధ నాగరాజు అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ట్ కి.. మేడ్చల్ రహదారిపై వందల కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారని పేర్కొన్నారు. 

 

వలస కూలీలను గుర్తించి ఫంక్షన్ హాల్స్ కి తరలించాలని హైకోర్ట్ సూచించింది. వాళ్ళు రైళ్ళు ఎక్కే వరకు కూడా వారి కోసం భోజన ఏర్పాట్లు చెయ్యాలని సూచించింది. సరిహద్దులు దాటి చేతులు దులుపుకోవద్దు అని పేర్కొంది. వారి కోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని తీసుకున్న చర్యలను హైకోర్ట్ దృష్టికి ఈ నెల 29 లోగా వివరించాలని కోర్ట్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: