ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి విషయంలో ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేసారు. మార్చి 24వ తేదీన కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారన్న ఆమె... ఎలాంటి సంసిద్ధత లేకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని ఆమె మండిపడ్డారు.

 

21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని... ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేస్తూ బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయని... టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజి ఒక క్రూయెల్ జోక్‌గా నిలిచిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: