మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజురోజుకూ మ‌రింత‌ ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క‌ ముంబైలోనే సుమారు 26 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున వేల సంఖ్యలో కేసులు పెరుగుతుండడంతో బాధితులను చికిత్స అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్రంలో 80 శాతం ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులలో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై న‌గ‌రంలో అనేక పాఠశాలలు, ఇతర సంస్థల భ‌వ‌నాల‌ను కొవిడ్‌-19 పేషెంట్లకు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: