విశాఖ వైద్యుడు సుధాకర్ విషయంలో అధికార వైసీపీ ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. ఆయన కేసు ని సిబిఐ కి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. ఇక ఆ వైద్యుడు ఒక సైకో అంటూ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపణలు చేసారు. సీఎంను ఉద్దేశించి ఇష్టానుసారంగా తిడుతుంటే ఊరుకుంటారా? అని ఆయన డాక్టర్ ని ఉద్దేశించి ప్రశ్నించారు. 

 

దళితుడు అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేసారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడే దళిత కార్డును వాడుకొచ్చని సూచించారు. సుధాకర్ విషయంలో పోలీసులు సంయమనంతోనే వ్యవహరించారన్న ఆయన... డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే సరిగా చేయలేదంటారని, హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ మంచిదే అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: