దేశ వ్యాప్తంగా కరోనా టెస్ట్ ల సంఖ్యను పెంచామని నాలుగు రోజుల్లో లక్ష టెస్టులు చేసామని ఐసిఎంఆర్ ప్రకటించింది. దేశంలో ఇంతవరకూ 27,55,714 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధినేత డాక్టర్ రామన్ ఆర్.గంగాఖేడ్కర్ మీడియాకు వివరించారు. 

 

ఆయన శుక్రవారం మీడియా తో మాట్లాడారు. మధ్యాహ్నం 1 వరకు 27,55.714 కరోనా పరిక్షలు చేసినట్టు చెప్పుకొచ్చారు. 18,287 టెస్టులు ప్రైవేట్ ల్యాబ్స్‌లో జరిగాయని ఆయన వివరించారు. గత నాలుగు రోజులలో... వరుసగా రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించామని అన్నారు. 85,542 టెస్టులు 401 ప్రభుత్వ ల్యాబ్స్‌లో  నిర్వహించామని. 18,287 టెస్టులు 178 ప్రైవేటు ల్యాబ్స్‌లో చేసామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: