తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదులో ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 30 రూట్లలో బస్సులు నడిపించాలని కేసీఆర్ సూచించారు. అయితే.. ఐడీ కార్డులను చూపించిన ఉద్యోగులను మాత్రమే బస్సులోకి అనుమతించాలని లేనిపక్షంలో అనుమతి ఇవ్వొద్దని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై హైదరాబాదులోని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

నిజానికి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండడంతో బస్సుల‌ను నడిపించడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగులు విధులకు హాజరు కావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: