తెలంగాణలోని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప‌ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. 45 రోజుల పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప‌ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా. నిజామాబాద్ స్థానిక సంస్థల‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

 

ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా మళ్లీ నిజాంబాద్ పై పట్టు సాధించాలని కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కవిత గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో క‌విత గెలుపును ఎలాగైనా అడ్డుకుని తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ నేత‌లు ఉన్నారు. దీంతో ఈ ఎన్నికపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: