ఒకప్పుడు తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపిన మాజీ ప్రముఖ హీరోయిన్ వాణీ శ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. చెన్నై లోని ఆమె ఇంట్లో ఆమె కుమారుడు గుండె పోటు తో ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యం తో బాధ పడుతున్నట్టు సమాచారం. ఆయనను ఇటీవల అమెరికా కూడా తీసుకుని వెళ్లి చికిత్స చేసారు. 

 

అయినా సరే ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు అని సమాచారం. ఆయన శనివారం ఉదయం గుండెపోటు రాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని తెలుస్తుంది. దీనితో పలువురు సినీ ప్రముఖులు వాణీ శ్రీ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. తెలుగు నుంచి కూడా పలువురు ఫోన్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: