తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్ సేవ‌ల వెబ్‌సైట్‌ను ప్రభుత్వ అనుబంధ వెబ్‌సైట్‌గా మార్చారు. టీటీడీ నుంచి ఈ మేరకు ప్రకటన జారీ అయింది. స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్ ను ప్రభుత్వ సైట్‌కు అనుబంధంగా మారుస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఈ వెబ్ సైట్ ద్వారా స్వామివారి ఆర్జిత‌సేవలు, ద‌ర్శ‌నం, బ‌స, క‌ల్యాణ‌మండ‌పాలు త‌దిత‌ర ఆన్‌లైన్ సేవ‌లను బుక్ చేసుకోవ‌డంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేష‌న్స్ సౌక‌ర్యం అందుబాటులో ఉంటుంది. 
 
https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్చినట్టు టీటీడీ ప్రకటించింది. కొత్త సైట్ అమలులోకి రానున్న కొన్ని గంటల ముందు టీటీడీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గత నెలలుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. అన్ని ఆలయాలను మూసివేయాలని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల్లో మార్పుల తరువాత శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: