దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను జోడించనుందని తెలుస్తోంది. సాధారణంగా మనం ఎవరి నంబర్ నైనా మొబైల్ లో సేవ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ ఆప్షన్ ను ఉపయోగించి సేవ్ చేసుకుంటూ ఉంటాం. మ్యానువల్ గా టైప్ చేసుకునే సమయంలో కొన్నిసార్లు నంబర్ తప్పుగా సేవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 
 
అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా అవతలి వ్యక్తి వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నంబర్ సేవ్ చేసుకునే ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వల్ల ఒక్క స్కాన్ తో కాంటాక్టులు మొబైల్ ఫోన్ లో యాడ్ అయిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: