కరోనా వైరస్ పై సిఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేసారు. ఐసోలేషన్ పడకలు ఆక్సీజన్ సదుపాయం పెంచాలి అని ఆదేశాలు ఇచ్చారు జగన్. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు చేసారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన పేర్కొన్నారు. 

 

ఇక కరోనా విషయంలో ప్రజలు అందరూ కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి పరిక్షలు చేయించుకోవాలని కరోనా రావడం పాపమో నేరమో కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కరోనా వస్తే ఏదో అయిపోతుంది అనే భయం అవసరం లేదని జాగ్రత్తగా వైద్య సహాయం తీసుకుంటే తగ్గిపోతుందని కంగారు పడి ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదని జగన్ ప్రజలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: