అడవిలో ఉండే మావోలకు కరోనా సోకింది అని ఇటీవల కాలంలో వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ తరుణంలో కొన్ని వార్తలు ఇప్పుడు మావోలను కలవరపెడుతున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ షాపుల వద్ద ప్రభుత్వాలు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాయి. 

 

ఎవరు ఎవరు వచ్చి మందులను కొనుక్కుని వెళ్తున్నారు అనే వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. ఎవరికి పడితే వారికి మందులు అమ్మవద్దని ఎవరికి ఏ మందులు అమ్మింది తమకు కచ్చితంగా డేటా ఇవ్వాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అదే విధంగా జ్వరం జలుబు దగ్గు కి సంబంధించిన మందులను డాక్టర్ సూచన ఉంటే మినహా గిరిజనులకు ఇవ్వొద్దని, ఎవరు ఎం తీసుకుని వెళ్ళారో నమోదు చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: