ఈ రోజు వరకు 2600 కి పైగా ప్రత్యేక రైళ్లు నడిచాయని కేంద్ర హోం వ్యవహారాల సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాస్తావ మీడియాకు వివరించారు. ఈ రైళ్ళ నుంచి 35 లక్షలకు పైగా వలస  కార్మికులను తరలించామని ఆమె చెప్పారు. ఆహార ధాన్యాల కొరత కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని తాము తనిఖీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

 

కాగా వలస కార్మికుల రైళ్ళను పలు రాష్ట్రాలు అంగీకరించడం లేదు. కరోనా కేసులు వారి నుంచి విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్న రాష్ట్రాలు ఇప్పుడు వలస కార్మికులను తమ రాష్ట్రంలోకి రావొద్దని కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు వారి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని రాష్ట్రంలోకి అనుమతులు ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: