వలస కార్మికులకు సంబంధించి ప్రతీ రోజు 200 ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తున్నాయని కేంద్ర రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వివరించారు. 40 లక్షల మంది వలస కూలీలు బస్సుల్లో వెళ్ళారు అని నడిచి వెళ్ళే వారికి తాము కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు వివరించారు. ప్రత్యేక రైళ్ళలో 80% ఉత్తరప్రదేశ్, బీహార్ వలస కార్మికులు ఉన్నారని ఆయన వివరించారు. 

 

ష్రామిక్ ప్రత్యేక రైళ్లను మే 1 న ప్రారంభించామని చెప్పారు. ప్రయాణీకులందరికీ ఉచిత భోజనం, తాగునీరు అందిస్తున్నామని వివరించారు. రైళ్లు స్టేషన్లలో సామాజిక దూరం పరిశుభ్రత ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎక్కడిక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నామని కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా చర్యలు చేపదుతున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: