ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని సినీ ప్రముఖులు కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా సిఎం ని ఇప్పటికే కలిసిన సినీ ప్రముఖులు సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా షూటింగ్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ సిఎం ని కలిసి తమ కష్టాలను వివరించాలని అదే విధంగా షూటింగ్ లకు సినిమాల విడుదలకు అంగీకరించాలి అని కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే సినీ పెద్దలు కొందరు ప్రత్యేక విమానంలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే జూన్ నుంచి సినిమా షూటింగ్ ల కోసం తెలంగాణా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: