కరోనా వైరస్ ఉద్ధృతి కనుక తగ్గితే జూన్ మధ్య నుంచి కానీ, జులై చివరి నుంచి కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాకు వివరించారు. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆగస్టు వరకో, సెప్టెంబరు వరకో ఎందుకు ఆగాలని ఆయన మీడియా ను ప్రశ్నించారు. 

 

పరిస్థితి నెమ్మదించినా, లేదంటే అది మనం ఊహించిన రీతిలో ఉన్నా మనం దానితో కలిసి సర్దుకుపోతామని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి జూన్ మధ్య నుంచో, జులై ఆఖరులోనే విమాన సేవలు తిరిగి ఎందుకు ప్రారంభించకూడదని  మీడియా ను మంత్రి ఎదురు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: