అంఫాన్ తుఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ ఒడిషా రాష్ట్రాలు ఏ స్థాయిలో నష్టపోయాయి అనేది తెలిసిందే. తుఫాన్ తో ఓడిశా తీర ప్రాంతాలు అన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇక బెంగాల్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తుంది. 

 

ఇక ఓడిశా కు హామీ ఇచ్చిన గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ నిధులు విడుదల చేయించారు. ఒడిశాకు కేంద్ర హోంశాఖ రూ.500 కోట్లు విడుదల చేసింది. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన 24 గంటల్లోపే కేంద్రం సాయం చేసింది. దీనిపై ఓడిశా అధికారులు ప్రధాని నరేంద్ర మోడికి ధన్యవాదాలు చెప్తున్నారు. నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలిసి మోడీ పర్యటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: