రాఘ‌వేంద్ర‌రావు.. తెలుగు చిత్ర‌సీమ‌లో ఎన్నో అద్భుత‌మైన తీర్చిదిద్దిన ద‌ర్శ‌కుడు. తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌గా ఎదిగాడు. ఈరోజు ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సినీరంగంతోపాటు అనేక రంగాల ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. టీడీపీ అధినేత‌ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ట్విట్ట‌ర్‌లో రాఘ‌వేంద్ర‌రావుకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

*వెండితెరపై తన సృజనాత్మకతతో ఇంద్రజాలాన్ని చేసి ప్రేక్షకులను మైమరపింపచేసిన శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రేక్షకులకు పదికాలాలు గుర్తుండిపోయే చిత్రాలను అందించిన మీరు, ఆనంద ఆరోగ్యాలతో నిండునూరేళ్ళూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను* అని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: