ఈ మధ్య కాలంలో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులకు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవావారికి, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రైతుకిచ్చి పెళ్లి చేయడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. యువతులు కూడా రైతును పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి ఉత్తర కర్ణాటక జిల్లాలోని కో ఆపరేటివ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తమ సహకార సంఘంలో సభ్యులైన యువ రైతులను వివాహం చేసుకునే వధువు ఖాతాలో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామని ప్రకటించింది. సొసైటీ అధ్యక్షుడు ఎస్.కే భట్ మాట్లాడుతూ ఆ డబ్బును వివాహం జరిగిన మూడేళ్ల తర్వాత వడ్డీతో సహా డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించామని చెప్పాడు. కో ఆపరేటివ్ సొసైటీలో దాదాపు 2,000 మందికి పైగా సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. గత నెల 1వ తేదీ నుంచి ఈ పథకం అక్కడ అమలవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: