ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి ఇప్ప‌టివ‌ర‌కు  ఎలాంటి వ్యాక్సిన్ లేదు. దీని బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డానికి సామాజిక దూరం పాటిస్తూ.. త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని నిపుణులు చెబుతున్నారు. లేనిప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే అనేక దేశాలు దీనిని త‌ప్ప‌నిస‌రి చేస్తున్నాయి. ప్ర‌తీ ఒక్క‌రు ఫేస్‌మాస్క్‌లు ధరించాల‌ని లేనిప‌క్షంలో జరిమానా త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నాయి.

 

కానీ.. అమెరికాలోని ఉత్తర డకోటా గవర్నర్ డౌ బుర్గమ్ మాత్రం త‌న‌స్టైలే వేరంటున్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని తెలివిత‌క్కువ నిర్ణ‌య‌మ‌ని అంటున్నారు. మాస్క్‌లు ధ‌రించాల‌ని చెబుతున్న‌వారి మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. నార్త్ డకోటాలో ఇప్ప‌టివ‌ర‌కు 2,300 కి పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. 52 మరణాలు సంభ‌వించాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: