భార‌త‌ దేశంలో రికార్డుస్థాయిలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గడం లేదు. గ‌త 24గంట‌ల్లో 6767 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 147 మంది మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3867 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కేసుల సంఖ్య 1,31,868 వేల‌కు చేరుకుంది. ఇక‌ యాక్టివ్ కేసుల సంఖ్య‌ 73560గా ఉంది. దేశంలో గత 24 గంటల్లో 3250 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీరేటు 41.39 శాతంగా ఉందని పేర్కొంది.

 

అయితే.. దేశ‌వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కరోనా వైర‌స్ పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు ఏడు రాష్ర్టాల్లోని పదకొండు మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. ఈ మున్సిపాలిటీలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌,  రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండ‌గా.. దేశంలోని అన్ని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించింది. ఈ జోన్లకు సంబంధించి అన్ని నిర్ణయాలు స్థానిక అధికారులే తీసుకోవాలని వెల్లడించింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: