మ‌ల‌యాళం యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో  *కురుప్* పేరుతో  చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్‌ సుకుమార కురుప్‌  జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార కురుప్‌ పాత్రలో దుల్కర్‌ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.

 

రీసెంట్‌గా షూటింగ్‌ ప్రారంభమైంది. శోభిత దూళిపాళ్ల‌ తొలిసారి ఈ సినిమా ద్వారా దుల్కర్‌తో క‌లిసి న‌టిస్తోంది.  తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో దుల్క‌ర్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: