నాందేడ్‌ జిల్లా ఉమ్రీ తాలుకాలోని నాగ్తానా గ్రామంలో బాలతపస్వి శివాచార్య నిర్వాణ్‌రుద్ర పశుపతినాథ్‌ మహారాజ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆశ్రమంలో పశుపతినాథ్‌ మహారాజ్‌తో పాటు మరో వ్యక్తిని దుండగులు చంపారు. మరో వ్యక్తి మృతదేహం ఆశ్రమంలోని మరుగుదొడ్డి వద్ద లభ్యమైంది. ఆశ్రమంలోకి ప్రవేశించిన దుండగులు.. విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం మహారాజు గొంతు కోసేందుకు య‌త్నించారు. అయితే దుండగుల నుంచి తప్పించుకునేందుకు పశుపతినాథ్‌ ప్రయత్నం చేసి కారులో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మహారాజును అత్యంత దారుణంగా చంపేశారు. అనంతరం అదే కారులో వెళ్లేందుకు దుండగులు యత్నించారు. అయితే గ్రామస్తులు మేల్కొనడంతో.. కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు దుండగులు.

 

ఈక్ర‌మంలో ఆశ్రమంలోని మరుగుదొడ్డిలో మరో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని మహారాజ్‌ సేవకుడిదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో మహారాజుతోనే సేవకుడు ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. మహారాజు, సేవకుడి మృతదేహాలను ఉమ్రీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. నిందితులను అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తరలించొద్దని మహారాజు భక్తులు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మహారాజు హత్యకు మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశుపతినాథ్‌ హత్యతో ఉమ్రీ తాలుకాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: