దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు రేపటి నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎందరో విమాన ప్రయాణాల కోసం ఎదురు చూస్తుంటే ఒక రాష్ట్రం మాత్రం మాకు విమానాలు వద్దు ఏమీ వద్దు అంటూ తిరస్కరిస్తుంది. ఆ రాష్ట్రమే మహారాష్ట్ర. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తమకు విమానాలు అవసరం లేదని దయచేసి విమానాలను తమ రాష్ట్రంలో నడపవద్దని కోరుతుంది. 

 

ముంబై నుంచి గాని పూణే నుంచి గాని నాగపూర్ నుంచి గాని ఒక్కటి అంటే ఒక్క విమానం కూడా ఎగరడానికి వీలు లేదని ఆ రాష్ట్రం స్పష్టంగా చెప్తుంది. తమకు కరోనా తీవ్రంగా ఉందని ఈ తరుణంలో తాము సాహసం చేయలేమని తమను అర్ధం చేసుకుని విమానాలను నడపవద్దని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: