లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. బుల్లితెర యాంకర్ అనసూయ తాజాగా నెటిజన్లతో చాట్ చేశారు. అభిమానులతో చాలా విషయాల గురించి ముచ్చటించారు. జీవితంలో విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నానని చెప్పారు. ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ముఖ్యమని అభిమానులకు చెప్పారు. 
 
పవర్ స్టార్ సినిమాలో ఎప్పుడు నటిస్తారని ఒక అభిమాని ప్రశ్నించగా తాను కూడా అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఒక అభిమాని మీ భర్తే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఒక ఫోటో షేర్ చేయగా అతనే నా ఫస్ట్, సెకండ్, థర్డ్ బాయ్ ఫ్రెండ్ అని భవిష్యత్తులో కూడా భర్తే బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. తన వివాహ మహోత్సవాన్ని ఇటలీలో జరుపుకుందామని అనుకున్నామని కానీ లాక్ డౌన్ వల్ల ఇప్పుడు అవేమీ చేయలేకపోతున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: