IHG

కరోనా టెస్టులు చేయించుకోలేదన్న ఉక్రోషంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన కజిన్ బ్రదర్స్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బిజ్నూర్‌లోని మలక్‌పూర్‌ గ్రామంలోచోటుచేసుకుంది. పనికోసం ఢిల్లీ వెళ్లిన మంజీత్‌ సింగ్‌ అనే వ్యతి లాక్ డౌన్ సడలించడంతో సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. అసలే కరోనా విస్తరిస్తుందేమో అన్న భయంతో మంజీత్‌ సింగ్‌ ను అతని కజిన్ సోదరులు అయినటువంటి   కపిల్‌, మనోజ్‌‌ లు కరోనా టెస్ట్ లు చేయించుకోవలసింది గా తమ సోదరుడికి సూచించారు. మంజిత్ సింగ్ టెస్టింగ్ కి ససేమీరా చేయించుకోనని చెప్పడంతో అతని పై కజిన్స్ అప్పుడప్పుడు కోపపడేవారు.

 

 

 

 

ఉన్నట్టుండి గురువారం రోజున ఆ గొడవ కాస్త పెద్దది అయ్యింది ..ఈ గొడవలో కపిల్ , మనోజ్ లు మంజిత్ సింగ్ పై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో మంజిత్ సింగ్ తలకు బలమైన గాయం కావడంతో అతనిని బిజ్నూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో మంజిత్ సింగ్ చికిత్స పొంతూ చని పోయాడు. ఈ ఘటన పై బిజ్నూర్ పరిధిలోని పోలీస్టేషన్ లో మంజిత్ సింగ్ తండ్రి కళ్యాణ్ సింగ్ కపిల్ , మనోజ్ లపై మర్డర్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు మంజీత్‌ కజిన్స్‌ కపిల్‌, మనోజ్‌, వారి తల్లి పుణియా, మనోజ్‌ భార్య డాలీలపై కేసు నమోదు చేశారు.కానీ ఇప్పటివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదు. అయితే బిజ్నూరు అడిషనల్‌ ఎస్పీ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ మంజిత్ సింగ్ కి మే 19 న స్క్రీనింగ్ టెస్ట్ చేశామని చెప్పింది అయితే అతనికి నెగటివ్ రావడంతో అతనిని ఇంటికి పంపామని చెప్పాడు. అదేవిధంగా అతనికి అక్కడ నెగిటివ్‌ రావడంతో అతని శాంపిల్స్‌ తీసుకోలేదని తెలియజేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: