ప్రముఖ స్టార్ రెజ్లర్‌ హనా కిమురా(22) ఆకస్మిమృతి అభిమాన‌లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయాన్ని రెజ్లింగ్‌ సంస్థ స్టార్‌డమ్‌ వెల్లడించింది. కిమురా మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అయితే కిమురా మరణానికి గల కారణాలు తెలియడం లేదు. కిమురా జపాన్‌లో మంచి రెజ్లర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల విపరీతమైన ఆదరణ పొందిన నెటిఫ్లిక్స్‌ రియాలటీ షో టెర్రస్‌ హౌస్‌లో ఆమె నటించారు. టెర్రస్‌ హౌస్‌ షోలో ఉండే ఆరుగురు రెసిడెంట్స్‌లో కిమురా ఒకరు.

 

అయితే కరోనా కారణంగా ఆ షో షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి నిలిచిపోయింది. కాగా, ఆమె తల్లి క్యోకో కిమురా కూడా మంచి రెజ్లర్ కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. మరోవైపు సైబర్‌ వేధింపుల వల్లే ఆమె మరణించారనే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: