ఇటీవల ఐసోలేషన్ వార్డుల్లో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ  ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. L-2 & L-3 కరోనా ఆస్పత్రుల ఐసోలేషన్ వార్డులలో రోగులు మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించిన ఉత్తర్వులను యుపి ప్రభుత్వం ఉపసంహరించుకు౦టూ ఆదేశాలు ఇచ్చింది. 


కాగా కరోనా వైరస్ ఎక్కువగా మొబైల్ ఫోన్ నుంచి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని మొబైల్ ఫోన్ గ్లాస్ పై నాలుగు నుంచి 5 రోజుల వరకు వైరస్ బ్రతికి ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధాలు విధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: