పాకిస్తాన్ లో  కరోనా కేసులు 50 వేలకు చేరువలో ఉన్నాయి. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశాలు కనపడటం లేదు. అయితే అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ప్రముఖులకు కూడా సోకుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక మహిళా ఎమ్మెల్యేకి అక్కడి పంజాబ్ రాష్ట్రంలో కరోనా సోకి మరణించిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ కరోనా బారిన పడ్డాడు. అతనికి డ్రైవర్ నుంచి కరోనా వచ్చిందని అధికారులు గుర్తించారు. అతనికి ప్రస్తుతం అతని ఇంట్లోనే ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరిని కూడా హోం క్వారంటైన్ చేసారు అధికారులు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: